మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

  • నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి
  • కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన చంద్రబాబు
  • ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన భాస్కరరావు
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలియజేశారు. నాదెండ్ల భాస్కరరావు తనయుడు, కేబినెట్ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భాస్కరరావు 90 ఏళ్ల వయస్సులో మృతి చెందిన విషయం తెలిసిందే. నెల రోజులుగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. గురువారం పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, 1984లో నెల రోజుల పాటు ఏపీ సీఎంగా పని చేశారు.

Nadendla Bhaskara Rao
Chandrababu Naidu
Nadendla Manohar
Andhra Pradesh
Former Chief Minister

More Telugu News